పార్లమెంట్‌లో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి వారికి వరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. పేదలు, మధ్యతరగతిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలంటూ మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఈ బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తారన్న అంచనాలు నెలకొన్నాయి.