పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ దేశ అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలన్నారు. 3 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.