లక్నోలోని ట్రాన్స్పోర్ట్ నగర్లో శనివారం ఒక భవనం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనం కుప్పకూలి ఓ ట్రక్కుపై పడింది. ఇప్పటి వరకు గాయపడిన 10 మందిని NDRF, SDRF సిబ్బంది వెలికి తీశారు. ఆసుపత్రికి తరలించారు. భవనం కింద భారీగా ప్రజలు సజీవ సమాధి అయ్యారని ప్రచారం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి.