ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు వ్యక్తులు భవనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. భవనం కూలిపోవడానికి ముందు భారీ శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.