ఢిల్లీలో ఒక వైపుకు ఒరిగిపోయిన భవనం (వీడియో)

72చూసినవారు
ఢిల్లీలోని షాదరాలో బిహారీ కాలనీలో ఓ భవనం ఒక వైపు ఒరిగిపోయింది. దీంతో ఆ భవనంపై ఎంసీడీ అధికారులు నోటీసు అతికించారు. ప్రమాదాన్ని నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని అక్కడి వారికి సూచించారు. భవనం అలా ఒరిగిపోడానికి గల కారణాలను అధికారులు విచారిస్తున్నారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్థానికులకు ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్