దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో మరో అడుగుపడింది. 300 కి.మీ. వంతెన పూర్తయిందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.1.08 లక్షల కోట్లు.