భారీ రికార్డుపై కన్నేసిన బుమ్రా

82చూసినవారు
భారీ రికార్డుపై కన్నేసిన బుమ్రా
ఇంగ్లండ్- భారత్ మధ్య జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుమ్రా భారీ రికార్డు అందుకునే ఛాన్స్ ఉంది. మరో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధిస్తే అద్భుత రికార్డు తన సొంతమవుతుంది. డబ్ల్యూటీసీ చరిత్రలో 12 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్(11) ఒక్కడే బుమ్రా కంటే ముందున్నాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌ల్లోనే ఆడనున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్