బుమ్రా.. కోహినూర్‌లా విలువైన వాడు: దినేశ్ కార్తిక్

72చూసినవారు
బుమ్రా.. కోహినూర్‌లా విలువైన వాడు: దినేశ్ కార్తిక్
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్.. బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ‘ బుమ్రా కోహినూర్‌లా విలువైనవాడు. అన్ని ఫార్మాట్లలో అతడి ప్రాముఖ్యం ఏంటో జనాలు ఇప్పటికే గుర్తించి ఉంటారు. ఏ ఫార్మాట్ అయినా.. ఏ బంతి అయినా తన సత్తా చాటుతాడు. టెస్టుల్లో 200కు పైగా వికెట్లు తీసుకున్న బౌలర్లలందరి కన్నా బుమ్రాకే మంచి యావరేజ్ ఉంది’ అని దినేశ్ కార్తిక్ అన్నాడు.

సంబంధిత పోస్ట్