వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగడం తగ్గించాలి. డార్క్ కలర్ బట్టలు ధరించకూడదు. పుచ్చకాయ, కర్బుజా, కీరదోస వంటి పండ్లను తినాలి. కారం, జిడ్డుగల ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక భోజనం మానుకోవాలి.