నడి రోడ్డుపై దగ్ధమైన కారు (వీడియో)

81చూసినవారు
ముంబైలోని కళ్యాణ్-బద్లాపూర్ రోడ్డులో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. కారులో కొందరు వెళ్తుండగా అకస్మాత్తుగా అందులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే దిగిపోయారు. క్షణాల్లోనే మంటలు పెరిగి కారు దగ్ధం అయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు ఎందుకు దగ్ధమైందో కారణం అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్