అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఒకరి మృతి

68చూసినవారు
అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఒకరి మృతి
కేరళలోని కొట్టాయంలో అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ భక్తుడు మరణించారు. కర్ణాటకకు చెందిన పలువురు అయ్యప్ప భక్తులు ఓ బస్సు శబరిమలకు బయలుదేరారు.ఈ క్రమంలో బస్సు ఎరుమేలి గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్