తమిళనాడులోని ఆరప్పాళెయంలో బస్సు డ్రైవరుపై డిపో అసిస్టెంట్ మేనేజరు మూరిముత్తు చెప్పుతో దాడి చేశాడు. మదురై నుంచి తిరుప్పూర్ వెళ్లే బస్సును డ్రైవరు ఆరప్పాళెయం వద్ద ఆపాడు. ఎంత సమయమైనా బస్సు తీయకపోవడంతో ప్రయాణికులు ప్రశ్నించారు. అసిస్టెంట్ మేనేజరు చెబితేనే తీస్తానని డ్రైవర్ బదులిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతడు డ్రైవరుని పిలిచి చెప్పుతో కొట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అసిస్టెంట్ మేనేజరును తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.