లోయలో పడిన బస్సు.. 31 మంది మృతి(వీడియో)

64చూసినవారు
బొలీవియా దేశంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోటోసి నుంచి ఒరురో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి యోకాలా సమీపంలోని ఓ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా భారీ మలుపు వద్ద యూటర్న్ చేస్తుండగా అదుపు తప్పి బస్సు లోయలో పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్