కారును ఢీకొట్టిన బస్సు.. ఐదుగురు మృతి (వీడియో)

59చూసినవారు
రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కారు గంగాపూర్ నుంచి కరౌలి వైపు వెళ్తుండగా.. బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్