లోయలో పడ్డ BSF జవాన్ల బస్సు.. 12 మందికి గాయాలు (వీడియో)

53చూసినవారు
జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వాటర్‌హేల్ ప్రాంతంలో BSF సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్