TG: సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బంది పెడితే బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేటు బస్సుల యజమానులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను దోపిడీకి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రెగ్యులర్ ఛార్జీలనే వసూలు చేయాలని చెప్పారు. అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆర్టీసీ అధికారులు రహదారులపైనే ఉండి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.