ఎండాకాలంలో మజ్జిగ తాగినట్లయితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. మజ్జిగలోని లవణాలు వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. మజ్జిగలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. ఎప్పుడూ కడుపు నిండుగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్స్, కాల్షియం, ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి. ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా దరిచేరవు.