ఆవాలతో ఆ సమస్యలకు బై బై
చల్లదనంతో కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగించిన సందర్భాల్లో ఆవాలు వాతాన్ని క్రమ పద్దతిలోకి తీసుకువచ్చి నొప్పిని, వాపుని నిరోధిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు మనకు వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధకతను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తింటే ప్రయోజనం లభిస్తుంది. ఆవాల్లో ఉండే కాపర్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయి.