తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు సైతం మర్చిపోయి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కోవలోకి నాస్తికుడు బైరి నరేష్ చేరారు. హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన సోమవారం సందర్శించారు. 'విగ్రహం గేట్లు తెరిపించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు' అని వ్యాఖ్యానించారు. పక్కనున్న వ్యక్తులు చెప్పడంతో ఆయన తన తప్పు గ్రహించారు.