ఎముకల ఆరోగ్యానికి క్యాబేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుందట. ఇక బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని సి విటమిన్ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.