తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల చుట్టూ జరుగుతున్న ఈ గొడవ పార్టీకి కీలక సమయంలో సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో అసంతృప్త నాయకులకు మంత్రి పదవులు లేదా కార్పొరేషన్ చైర్మన్, ఇతర కీలక బాధ్యతలు ఇచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. అయితే అసమ్మతి నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.