సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో టికెట్ ధరలు, సినిమా అదనపు షోల నిర్వహణపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మరోవైపు సినీ పరిశ్రమ తరఫున తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.