విమాన ప్రమాదంపై ఇప్పుడే స్పష్టమైన కారణాలు చెప్పడం తొందరపాటు అవుతుందని విశ్రాంత వింగ్ కమాండర్ మంతెన జగన్‌మోహన్ రాజు పేర్కొన్నారు. ఆయన ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “విచారణ పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలి. విమానయాన రంగంలో సాంకేతిక అంశాలను సమగ్రంగా విశ్లేషించాల్సి ఉంటుంది” అని అన్నారు. ఆయన విమాన సాంకేతిక పదాలను సులభంగా, అర్థమయ్యేలా వివరించారు.