సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ మరణంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో డీఎస్‌కు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదని అన్నారు. ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వర్తించి చాలా రాజకీయ నాయకులకు డీఎస్ ఆదర్శప్రాయుడిగా ఉన్నారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.