కెనడా అమెరికాలో కలిసి పోవాలని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ స్పందించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో భాగం కాబోదని కౌంటర్ ఇచ్చారు. తమ దేశం అప్పటికీ, ఇప్ప టికీ బలంగా ఉందన్నారు. వాణిజ్యమైనా, క్రీడలైనా చివరకు విజయం సాధించేది తమ దేశమేనని పేర్కొన్నారు.