భారతదేశంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల కోసం ఆరు నెలల్లో వ్యాక్సిన్ రాబోతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ అన్నారు. మంగళవారం ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశోధన దశ ముగించుకుని తుది దశలో ఉందని, 9 నుంచి 16 ఏళ్లు వయసు పైబడిన యువతులకు ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చని తెలిపారు.