చలి కాలంలో అనేక మంది హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కొల్పోతుంటారు. ఈ క్రమంలో బాపట్ల ఫార్మసీ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ సాయి కిషోర్, పరిశోధన విద్యార్ధులతో కలిసి ఒక క్యాప్సూల్‌ను తయారు చేశారు. డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్, ప్రొప్పొనాలోల్ హైడ్రోక్లోరైడ్ మందులను పిల్లెట్ల రూపంలోకి మార్చి క్యాప్సూల్స్ తయారు చేశారు. ఇవి తెల్లవారుజామున వచ్చే గుండెపోటు మరణాలను తగ్గిస్తాయని వారు పేర్కొంటున్నారు.