AP: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడలోని వంద అడుగుల రోడ్డు సమీపంలో ఓ కారు అదుపుతప్పి ఒక ఆవును, రెండు బైక్‌లను ఢీకొట్టి.. పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.