జనగామలో బీభత్సం సృష్టించిన కారు(వీడియో)

52చూసినవారు
TG: జనగామ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. సూర్యాపేట రోడ్డులో నలుగురు యువకులు అత్యంత రాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయందోళనకు గురిచేశారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డుపై ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి.. యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానిక సీసీ టీవీల్లో రికార్డు అయింది.

సంబంధిత పోస్ట్