TG: మెదక్ జిల్లా వెంకట్రావు పేట సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంగు రూట్‌లో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు గాలిలో ఎగిరి కిందపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నిద్రమత్తులో డ్రైవర్ వారిని ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.