ఏపీలోని బాపట్ల జిల్లాలో మార్టూరు హైవేపై బొల్లాపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు స్నేహితులు ట్రిప్ కు వెళ్ళి వైజాగ్ వైపు వెళుతుండగా ముందు టైరు పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆ కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు సైడు భాగం నుజ్జు నుజ్జు కాగా.. కారులో ఉన్న ఏడుగురిలో వైజాగ్‌కు చెందిన భీమన నవీన్ (32) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.