TG : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ రింగు రోడ్డు వద్ద కారు-లారీ ఢీకొని స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమం కావడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా మృతులు గోదావరిఖనికి చెందిన లింగం (48), ప్రణయ్ (24)గా పోలీసులు గుర్తించారు. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.