నిరసనకారుల పైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్‌

53చూసినవారు
అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్‌లో ప్రారంభమైన నిరసనలు అమెరికా అంతటా విస్తరించాయి. షికాగోలో మంగళవారం ఓ ఎరుపు కారు నిరసనదారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 66 ఏళ్ల మహిళకు తీవ్రగాయాలయ్యాయి. తాజాగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్ ఏంజెలెస్‌లో ICE సోదాల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్ కరెన్ బాస్ కర్ఫ్యూ విధించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్