BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు

80చూసినవారు
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు
TG: హుజూరాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. తమ కుటుంబసభ్యులకు తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌-1 పరీక్ష స్కామ్‌లో ప్రమేయం ఉందని కౌశిక్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ వ్యవసాయం, రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు, అఖిలభారత బంజారా సేవా సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు బుధవారం మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్