సినీనటి మాధవీలతపై ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేసు నమోదైంది. గత డిసెంబర్ 31న తాడిపత్రి JC పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ తెలిపారు. ఇటీవల మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆపై ఆమెకు సారీ చెప్పిన సంగతి తెలిసిందే.