టాయిలెట్‌లో ఉండి వర్చువల్‌ విచారణకు హాజరైన వ్యక్తి కేసు నమోదు

91చూసినవారు
టాయిలెట్‌లో ఉండి వర్చువల్‌ విచారణకు హాజరైన వ్యక్తి కేసు నమోదు
అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి విచారణకు హాజరైన విధానంపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జూన్ 20న వర్చువల్ విచారణ సందర్భంగా సూరత్‌కు చెందిన అబ్దుల్ సమద్ అనే వ్యక్తి టాయిలెట్‌ నుంచి విచారణకు హాజరయ్యాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కోర్టు సుమోటోగా దీనిపై స్పందించింది. జస్టిస్ ఏ.ఎస్. సుపేహియా, జస్టిస్ టీ.ఆర్. వచ్ఛనీలతో కూడిన డివిజన్ బెంచ్, కోర్టు ధిక్కరణగా కేసు నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్