'నేషనల్ హెరాల్డ్' ప్రచురణకర్త 'అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకుని, రూ.రెండు వేల కోట్ల విలువచేసే ఆస్తుల్ని తప్పుడు మార్గాన కైవసం చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. 2014 జూన్ 26న ఆయన ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దానిలో సోనియా, రాహుల్, మోతీలాల్‌వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, దుబే, పిట్రోడా తదితరుల పాత్ర ఉందని ఆరోపించారు.