కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. అధిష్టానం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కాగా ఇటీవల జరిగిన కులగణనపై విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు, మంత్రులు సైతం బహిరంగంగా విమర్శలు చేశారు. అగ్ర వర్ణాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కులగణన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.