తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆమోదించిన కులగణన సర్వే మీద కొందరు అపోహలు వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. 'ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కుల గణన సర్వే ఎలా జరిగింది అనేది ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ వివరిస్తుంది. ఇంత శాస్త్రీయంగా, లాజికల్‌గా దేశంలోని ఏ రాష్ట్రంలో కులగణన జరగలేదు. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వే జరిగింది. కుల గణన సర్వే నివేదికను సంక్షేమ పథకాల రూపకల్పన కోసం ఉపయోగిస్తాం' అని చెప్పారు.