తెలంగాణలో మరోసారి కులగణన చేపట్టనున్నట్లు సర్కారు ప్రకటించడంపై కేటీఆర్ X వేదికగా స్పందించారు. 'కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం.. అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.