తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే 3 వారాల పాటు కొనసాగనుంది. ఈ సర్వేలో కుటుంబానికి సంబంధించిన అన్ని రకాలు వివరాలు నమోదు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని వినియోగిస్తోంది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ఎక్కువ శాతం విధుల్లో పాల్గొంటున్నారు. అయితే వీరికి సర్వే పూర్తయిన వెంటనే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10,000 గౌరవ వేతనం జమ కానున్నాయి.