తెలంగాణ కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణణ సర్వే ఖర్చులో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు రూ. 10 వేలు, సూపర్‌వైజర్‌కు రూ. 12 వేలు, మండల్ నోడల్ ఆఫీసర్‌కు రూ. 15 వేలు గౌరవ వేతనంగా ఇచ్చినట్లు తెలిపారు. మొత్తానికి కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేకు ఖర్చు రూ. 160 కోట్లు అయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.