TG: కులగణన సర్వేపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేబినెట్ భేటీలో సర్వేను ప్రవేశపెడతామని.. అదేరోజు శాసనసభలో కులగణన సర్వేను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. రాహుల్ గాందీ కోరిక మేరకు సర్వే చేపట్టామని తెలిపారు. ప్లానింగ్ కమిషన్ అధికారులు కులగణన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఆదివారం అందజేశారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ నివేదికను అందుకున్నారు.