దేశ రాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రావూస్ కోచింగ్ సెంటర్‌లో వరదనీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టిందని అధికారులు బుధవారం వెల్లడించారు.ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఓ సినియర్ అధికారిని నామినేట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి)ని హైకోర్టు కోరింది.