నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ

55చూసినవారు
నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం ఉదయం 11 గంటలకు సీసీఎస్ కేబినెట్ మరోసారి భేటీ కానుంది. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఆర్థిక ఆంక్షలు, ఇకపై తీసుకోనున్న సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్‌తో జరిగే ఏవైనా చర్చలు పీవోకే, ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై దృష్టి సారించేలా ప్రధాని భద్రతా దళాలకు సూచించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్