యూపీలోని బిజ్నోర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెక్కతో నిండిన ఓ లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.ట్రక్కు డ్రైవర్ ఏదో విధంగా దూకి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. డివైడర్‌ను ఢీకొట్టడంతో ట్రక్కు బోల్తా పడినట్లు వీడియోలో కనిపిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.