ఈవీఎంలు భద్రపరిచే చోట సీసీటీవీలు ఆపేశారు: సుప్రియా సూలే (Video)

74చూసినవారు
ఈవీఎంలు భద్రపరిచిన గోదాంలో 45 నిమిషాలపాటు సీసీటీవీలు ఆపేశారని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ కుమార్తె, బారామతి లోక్‌సభ అభ్యర్థి సుప్రియా సూలే ఆరోపించారు. లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్ బీజేపీ అభ్యర్థిగా సుప్రియా సూలేపై పోటీ చేసింది. మే 7న మూడో దశ పోలింగ్‌లో భాగంగా బారామతితోపాటు ఇతర నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. నాటి నుంచి ఈవీఎంలను బారామతిలోని ఎఫ్‌సీఐ గోదాంలో భద్రపరిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్