POKను పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందే: భారత్ (VIDEO)

85చూసినవారు
కాల్పుల విరమణ విషయంపై పాకిస్థానే ముందుగా ప్రతిపాదన చేసిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. పాక్ కాల్పులు ఆపిన తర్వాతే భారత్ స్పందించినట్లు వివరించారు. జమ్మూకశ్మీర్ విషయంలో భారత వైఖరిలో మార్పులేదని, ద్వైపాక్షిక చర్చలకే ప్రాధాన్యం ఇచ్చే మేము ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. పీవోకే భారత్‌లో భాగమేనని, పాక్ వెంటనే ఖాళీ చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్