యాదాద్రి ప్రధానాలయంలోకి సెల్‌ఫోన్లను కూడా నిషేధిస్తూ గతంలో ఆలయ ఈవో భాస్కర్‌రావు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిబంధనను సాధారణ భక్తులతోపాటు వీవీఐపీలు మొదలుకొని.. అధికారులు, సిబ్బంది, అర్చకులు, పోలీసులు, మీడియా, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వరకువర్తించనుంది. ఎవరైనా ప్రధాన ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.