వంటగ్యాస్ ఈకేవైసీపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. వంటగ్యాస్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తిచేసేందుకు కేంద్రం కానీ.. చమరు సంస్థలు కానీ ఎలాంటి తుది గడువు విధించలేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను తొలగించేందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు ఈకేవైసీ ఆధార్ అథెంటికేషన్ పక్రియను చేపడుతున్నాయి. గత 8 నెలలుగా ఇది కొనసాగుతోందని తెలిపారు. దీంతో పాటు చమురు సంస్థల యాప్లను ఇన్స్టాల్ చేసుకొని కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు అని తెలిపారు.